బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం చేస్తున్న అనకాపల్లి బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

ప్రజాశక్తి-అనకాపల్లి

అనకాపల్లి బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎంజెవిఎన్‌ కుమార్‌ అధ్యక్షతన ఎన్నికల అధికారి ప్రభాకర్‌ నేతృత్వంలో ప్రమాణ స్వాకారం జరిగింది. ఇటీవల జరిగిన బార్‌ ఎన్నికల్లో అధ్యక్షులుగా కుమార్‌, కార్యదర్శిగా దుర్గారావు, ఉపాధ్యక్షులుగా రోజా, కోశాధికారిగా సందీప్‌, జాయింట్‌ సెక్రటరీగా తులసి, స్పోర్ట్స్‌ సెక్రెటరీగా మోహన్‌, లైబ్రేరియన్‌గా జగపతి, మహిళా ప్రతినిధిగా కుసుమతో పాటు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా పలువురు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమార్‌ మాట్లాడుతూ బార్‌ అసోసియేషన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కొత్త కోర్టు బిల్డింగ్‌ నిర్మాణం కోసం సీనియర్‌లను సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సెక్రెటరీ శ్రీనివాస్‌ పాల్గొని నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు.

➡️