ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో ఎన్జీవో రాష్ట్ర మాజీ నాయకులు షేక్ అబ్దుల్ బషీర్ నాలుగో వర్థంతి కార్యక్రమాన్ని ఎన్జీవో నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ బషీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం బషీర్ ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఎన్‌జిఒల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన కామ్రేడ్ బషీర్ సేవలు మరువలేనివి అన్నారు. బషీర్‌ను ఆదర్శంగా తీసుకుని ఎన్జీవో నాయకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు పిల్లి రమణారెడ్డి, రషీద్, హజరత్ అలీ, షరీఫ్, కే నాగమల్లేశ్వరరెడ్డి, రహమత్, ఎస్ రాంప్రసాద్, మల్లికార్జున్, శివరాంరెడ్డి, పెద్దిరెడ్డి, జెవివి నాయకులు వి మాలకొండారెడ్డి, మాంటిస్సోరి స్కూల్ కరస్పాండెంట్ పిచ్చిరెడ్డి, బీసీ నాయకులు చింతలపూడి చిన్న వెంకటసుబ్బయ్య, నాగూర్‌బి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
