వృద్ధులకు బి సి జి టీకాలు అందించాలి : కిషోర్‌ కుమార్‌ రెడ్డి

May 16,2024 14:58 #kalagada

ప్రజాశక్తి- కలకడ: దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వఅద్ధులకు బీసీజీ టీకాల అందించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఎర్రకోటపల్లి వయోజన క్షయ టీకా( బి సి జి) వైద్యాధికారులు ఎం వి కిషోర్‌ కుమార్‌ రెడ్డి , పి జవహర్‌ బాబు సంయుక్త ఆధ్వర్యంలో అడల్ట్‌ బి సి జి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నూటికి నూరు శాతం టీకాలు అందించాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలను యం ల్‌ హె చ్‌. పి లాను 100 శాతం చేయాలని ఆదేశించారు.ఆరోగ్య విస్తరణ అధికారి జి.జయరామయ్య టీబి వ్యాధికి సంబంధించిన రిజిస్టర్‌ లను అన్నింటిని తరవుగా క్రాస్‌ చెక్‌ చేశారు. సచివాలయం వారిగా అడల్ట్‌ టీబి వ్యాక్సినేషన్‌ టార్గెట్‌ ప్రతి సచివాలయంలో 70 మంది చొప్పున వేయాలని విస్తరణ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.భారతమ్మ గణాంక అధికారి షేక్‌ ఇస్మాయిల్‌ ఎఫ్‌ ఎన్‌ ఓ బి అలివేలు మంగబాయి అటెండర్‌ సునీత పాల్గొన్నారు.

➡️