బెట్టింగ్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి

  • కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి

ప్రజాశక్తి – కడప : బెట్టింగ్‌ యాప్స్‌ పట్ల యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. శనివారం కడప జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎన్‌.డి. విజయ జ్యోతి ఆధ్వర్యంలో ”బెట్టింగ్‌ యాప్స్‌ అప్రమత్తత” పోస్టర్‌ విడుదల చేశారు. ”బెట్టింగ్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి”, ”ఆనందాన్ని అనుభవించండి.. కానీ బెట్టింగ్‌ యాప్స్‌ వైపు వెళ్లద్దు” అని ఈ సందర్భంగా విజయ జ్యోతి సూచించారు. ”మొదట లాభాలు చూపించి, చివరికి దోచుకుంటాయి”, ”ఆనందంగా మొదలై.. అలవాటుగా మారుతుంది” వంటి సందేశాలతో కూడిన ఈ పోస్టర్‌ను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, గౌస్‌ పీర్‌ సేనహొ అధ్యక్షులు సయ్యద్‌ గౌస్‌ పీర్‌ రూపొందించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్‌ సెక్రటరీ పీ.అలి ఖాన్‌, పీసీసీ డెలిగేట్‌ పొట్టిపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, క్రైస్తవ మైనారిటీ జిల్లా అధ్యక్షురాలు పీ.డి. సంజయ్ కాంత్‌, అబ్దుల్‌ సత్తార్‌, హరి ప్రసాద్‌, రఫిక్‌ ఖాన్‌, సుబ్రహ్మణ్యం శర్మ, కదిరి ప్రసాద్‌ గౌడ్‌, సిరాజుద్దీన్‌ పాల్గొన్నారు.హొ ఇకపై బెట్టింగ్‌ యాప్స్‌ మాయాజాలానికి గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాధితులు 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

➡️