అభాగ్యులకు అండగా ఉండాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ : అభాగ్యులను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలని ప్రముఖ ధార్మిక గురువు, ప్రభుత్వ ఖాజి సయ్యద్‌ షర్భుద్దీన్‌, అహ్మద్‌ బాబు భారు అన్నారు. బుధవారం మక్తబ ఎ ఇమ్దాదుల్‌ ఖుర్‌ఆన్‌లో పైగామే అమన్‌ (శాంతి సందేశం) అనే అంశంపై ధార్మిక కార్యక్రమం నిర్వహహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సేవ చేయడంలోనే సంతప్తి ఉందని ఖుర్‌ఆన్‌, దైవ ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలతో మానవతం మానవుల ఉపకారం ఒకరినొకరు తొడ్పడం విధవలు, అనాధలు అభాగ్యలను ఆదుకోవాలని ఇందు కోసం అందరు నడుంబిగించి అందరు ఐకమత్యంతో ఉండి సమస్యలను పర్షికరించుకోవాలని పేర్కొన్నారు. సేవ చేయడంలో కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ఆపదలో ఉండే వారిని ఆదుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంకు వచ్చిన పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులను దుశాలువతో సత్కరించారు. కార్యక్రమంలో సహారా వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆఫ్‌ తాబ్‌, గౌరవ సలహాదారుడు నిజాంఖాన్‌, జిలాన్‌, అమానత్‌ సేవా సొసైటీ కార్యదర్శి జిలాన్‌ హకీం, ఫర్హాన్‌ మొహమ్మద్‌ అలీ, ఆరిఫ్‌ పాల్గొన్నారు.

➡️