డప్పు కళాకారుడు ఉన్నం సంస్కరణ సభను జయప్రదం చేయండి

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌: నాలుగు దశాబ్దాలుగా ప్రజా కళామండలి కళాకారుడిగా, డప్పు, దరువుతో, పాటలతో ప్రజలను అలరించిన కామ్రేడ్‌ ఉన్నం సంస్కరణ సభను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి చికినం చిన్న కోరారు. మంగళవారం మార్టూరు లోని గన్నవరం రోడ్డులో పౌరహక్కుల సంఘం సభ్యులు బొల్లాపల్లి బెన్ని బాబు ఆధ్వర్యంలో ఉన్నం నాగేశ్వరరరావు సంస్కరణ సభ కరపత్రాన్ని చిన్న ఆవిష్కరించారు. ఈ నెల 6న సత్తెనపల్లి సమీపంలోని వడ్డేపల్లిలో జరగనున్న ఉన్నం సంస్కరణ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో ప్రజా కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల నా యకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాం గ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ సనావుల్లా, మౌలాలి, గొట్టిపాటి పవన్‌ కుమార్‌, శేషు, విజయకుమార్‌ పాల్గొన్నారు.

➡️