సన్‌ ఇనిస్టిట్యూట్‌కు ఉత్తమ పర్యాటక విద్యాసంస్థ అవార్డు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరానికి చెందిన సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థకు ఉత్తమ పర్యాటక విద్యాసంస్థ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిఎండి శ్రీకాంత్‌ జాస్తి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆశా జాస్తికి అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అందించారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల అధినేతల సమక్షంలో ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని శ్రీకాంత్‌ జాస్తి పేర్కొన్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

➡️