‘ఇంటూరి’కి శుభాకాంక్షల వెల్లువ

Jun 8,2024 21:55
'ఇంటూరి'కి శుభాకాంక్షల వెల్లువ

ఇంటూరికి కేక్‌ తినిపిస్తున్న అభిమానులు
‘ఇంటూరి’కి శుభాకాంక్షల వెల్లువ
ప్రజాశక్తి-కందుకూరుఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వస్తున్న వారితో గత నాలుగు రోజులుగా కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాల యం కిటకిటలాడుతోంది. వివిధ వర్గాల ప్రజలు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నాగేశ్వరరావుని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెబుతు న్నారు. పుష్పగుచ్చాలు అందిస్తూ శాలు వాలతో సత్కరిస్తున్నారు. కందుకూరు పట్టణంలోని పలువురు ముస్లిం సోదరులు, నాగేశ్వరరావు చేత కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ మున్నా, నెల్లూరు పార్లమెంట్‌ తెలుగు యువత కార్యదర్శి షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ ఇశ్రాని, రూబీ, ఖాదర్బాషా, గౌస్‌ బాషా, అమీరుల్లా, వలి, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం ఆధ ్వర్యంలో మాలకొండలో 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. కందుకూరు పట్టణానికి చెందిన తొట్టెంపూడి రమణ ఆధ్వర్యంలోనూ 101 కాయలు కొట్టారు.

➡️