ఎమ్మెల్యే బీఎన్‌కు శుభాకాంక్షలు

ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన బిఎన్‌ విజరుకుమార్‌ను ఒంగోలులోని ఆయన నివాసంలో సంతనూతలపాడు తహశీల్దారు ఎస్‌కే మీరావలి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు విజరుకుమార్‌కు తహశీల్దారు మీరావలి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు షాజహాన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉపేంద్ర పాల్గొన్నారు. వీరి వెంట మండల టిడిపి అధ్యక్షులు మద్దినేని హరిబాబు పాల్గొన్నారు.

➡️