ఎంపీ మాగుంటకు శుభాకాంక్షలు

ప్రజాశక్తి-సిఎస్‌పురం : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని భైరవకోన ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ గుంటిమడుగు వెంకటరామరాజు సతీసమేతంగా మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలులోని కార్యాలయంలో మాగుంటను కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం సిఎస్‌ పురం మండల రాజకీయ పరిస్థితులు, భైరవకోన అభివద్ధి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వెంట వెంకటరామరాజు, సతీమణి సుబ్బరత్తమ్మ, సోదరి శాంతమ్మ, ముప్పాళ్ళ నగేష్‌, సునీల్‌ పాల్గొన్నారు.

➡️