ఫొటో : వేమిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తున్న చెంచలబాబుయాదవ్
వేమిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు
ప్రజాశక్తి-ఉదయగిరి : పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జెడ్‌పి చైర్మన్ చెంచల బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నెల్లూరులోని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపామన్నారు. వేమిరెడ్డి సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నాయకులు మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దుత్తలూరు మాజీ ఎంపిపి రవీంద్రబాబు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ జెడ్‌పిటిసి కలివెల జ్యోతి చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.