చిరుధాన్యాలతోనే మెరుగైన ఆరోగ్యం

Nov 29,2024 17:44 #Annamayya district

ప్రజాశక్తి – కలికిరి : చిరుధాన్యాలతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని కెవికె కోఆర్డినేటర్ డాక్టర్ మంజుల తెలిపారు. నైపుణ్య శిక్షణలో భాగంగా కొర్ర, రాగి బిస్కెట్లు, ఫ్రూట్ జ్యూస్, పన్నీర్ తయారీ కెవికె కలికిరి నందు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగంగా శుక్రవారం రాగి, కొర్ర బిస్కెట్ల తయారీ చేపట్టారు. మొదటగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె. మంజుల చిరుధాన్యాలైన రాగి, కొర్ర, జొన్న, సామలు, అండు కొర్రలు, సజ్జ, ఊదలు, అరికలు మొదలగు వాటి వలన కలిగే ఉపయోగాలను వివరిస్తూ ఆరోగ్య సంరక్షణలో వీటి పాత్రను కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తెలిపారు. ఈ చిరుధాన్యాలలోని పోషకాలు చక్కర వ్యాధిగ్రస్తులకి, రక్త బలహీనత గల వారికి, హృద్రోగులకు, స్త్రీలకు, వృద్ధులకు, పిల్లలకు విరివిగా వాడితే ఆరోగ్యపరంగా మంచి ఫలితం ఉంటుందని డాక్టర్ ఏ. శ్రీనివాసులు, కెవికె శాస్త్రవేత్త తెలిపారు. కలికిరి నివాసులైన అభ్యుదయ మహిళ అలివేలు మంగమ్మ కొర్ర, రాగి సంబంధిత బిస్కెట్ల తయారీకి కావలసిన ముడి పదార్థాలను ముందుగా ఎలా తయారు చేసుకోవాలి అని మహిళలకు శిక్షణలో వివరించారు. తర్వాత ఈ పదార్థాలను సరైన మోతాదుల్లో కలుపుతూ మంచి నాణ్యత గల బిస్కెట్లను తయారు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో 20 మంది మహిళలు పాటు అంగన్వాడీ కార్యకర్తలు, కేవీకే సిబ్బంది, వ్యవసాయ కళాశాల విద్యార్థునులు పాల్గొన్నారు.

➡️