క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు : జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు : చిత్తూరు గంగసాగరం వద్ద అర్ధరాత్రి 12.15 గంటలకు. జరిగిన రోడ్డు ప్రమాద ఘటన లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. అర్ధరాత్రి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుల తరలింపు వైద్య సేవల నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను కలెక్టర్‌ జారీ చేశారు. సంఘటన స్థలం నుండి అర్ధరాత్రి సమయాన్ని కూడా లెక్కచేయకుండా చిత్తూరు ప్రభుత్వాసుప్రతికి వచ్చి క్షతగాత్రులతో మాట్లాడి స్వయంగా వైద్యులకు వైద్య సేవల నిమిత్తం తగు సూచనలు జారీ చేసి తెల్లవారు జామున 3 గంటల వరకు హాస్పిటల్‌ వద్దనే ఉన్న జిల్లా కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షించారు.

Accident – ఘోర ప్రమాదం – నలుగురు మృతి

➡️