తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మంచాలు వితరణ

Mar 11,2025 17:12 #beds

ప్రజాశక్తి – మండపేట : మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది, ఇతర దాతల సహకారంతో ఏలేశ్వరం మండలం పెదశంకర్లపూడి గ్రామంలో బెతెస్త ఆశ్రమంలో ఉన్న పిల్లలకు 20 మంచాలను, నిత్యావసర వస్తువులను వితరణ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి కె వి శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చేరదీసి బేతేస్త ప్రార్థన మందిర నిర్వాహకులు పాస్టర్ కిషోర్ చేస్తున్న నిస్వార్థమైన సేవలకు స్పందించి కళాశాల రికార్డు అసిస్టెంట్ వారా వెంకట రావు కుటుంబం 4 నెలలకు సరిపడా కిరాణా సామాగ్రి , విద్యార్దులకు పరీక్ష సామాగ్రి తదితర వస్తువులను అందించారని తెలిపారు. కళాశాల విస్తృత సేవలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇకముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కిరణ్ కుమార్, గోపాల కృష్ణ, మధు కుమార్ అభినయ్, రామకృష్ణ నరేష్ అనపర్తి గ్రామ సర్పంచ్ వారా కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️