ప్రజాశక్తి – కొమరోలు: కొమరోలు మండల తహశీల్దారుగా భాగ్యలక్ష్మి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె మార్కాపురం డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఇక్కడకు వచ్చారు. నూతన తహశీల్దార్ భాగ్యలక్ష్మికి రెవిన్యూ సిబ్బంది స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, తిరుమలరెడ్డి, చలిచీమల శ్రీనివాస్ చౌదరి, మండల నాయకులు, తదితరులు తహశీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
