బొబ్బిలి డిఎస్‌పిగా భవ్య

Jan 20,2025 20:59

 ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి డిఎస్‌పిగా జి.భవ్యరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిఎస్‌పి శ్రీనివాసరావుకు నర్సీపట్నం బదిలీ అయింది. భవ్యకు డిఎస్‌పి శ్రీనివాసరావు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. బొబ్బిలి డివిజన్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలు, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి భవ్య చెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, రైల్వే, టెలికాం రంగాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినట్లు వివరించారు. గ్రూపు-1లో డిఎస్‌పిగా ఉద్యోగం సాధించి, బొబ్బిలిలో మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించారు.

➡️