ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని రామవరం పంచాయతీలో రూ.1.60కోట్ల ఉపాధి హామీ నిధులతో భీమం దొరపాలెం కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రామవరం గ్రామస్తుల చిరకాల కోరిక బిఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్‌ను ప్రారంభించి, 4జి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. రామవరం గ్రామ సర్పంచ్ ఎర్రరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ, రామవరం, భీమం దొరపాలెం, కోలవానిపాలెం, కణమాం సర్పంచ్‌లు రాజు, చిన్నికుమారి, సోములమ్మ శ్రీకాంత్, ఆబోతు అప్పలరాము పట్టుబట్టి తమ గ్రామాల అభివృద్ధికి నిధులు రాబట్టుకున్నారన్నారు. యువ సర్పంచ్‌ల నేతృత్వంలో ఆయా పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని, వారికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. భీమిలిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల కోరిక మేరకు.రామవరం నుంచి గంగసాని అగ్రహారం వరకు మరో రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలను ఎమ్మెల్యే గంటా మంజూరుచేశారు. ఇళ్లపట్టాలు, డ్రైనేజీలు,వీధిరోడ్లు ఇతర సమస్యలపై గంటాకు విన్నవించిన, వారు గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు.. జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పంచకర్ల సందీప్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు పూర్వవైభవం వస్తోందని, దానికి ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారుఈ సంరద్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్‌ఆర్ట్స్ చిన్నారుల నృత్యాలు, సీతారామాంజనేయ బృందం కోలాటం అందర్నీ అలరించాయి. కార్యక్రమంలో అగరపు దేవుడుబాబు, కట్టమూరి సోమునాయుడు ఎర్ర రాము సోంబాబు, తాట్రాజు అప్పారావు, బిఆర్‌బి నాయుడు, బలిరెడ్డి మల్లికార్జునరావు ( చంటి), ఎంపిటిసి గొలగాని కృష్ణ, మహంతి శివాజీ, పాండ్రంకి అప్పలరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గంటా