ప్రజాశక్తి-చాగలమర్రి (నంద్యాల) : రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తాము సహకరిస్తామని ఆళ్లగడ్డ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జెడ్పి హైస్కూలు క్రీడా మైదానంలో 53వ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ సీనియర్ పురుషుల ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పోటీల నిర్వహణలో ఆళ్లగడ్డ నియోజకవర్గం మొదటి స్థానం తెప్పించే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఇందుకోసం మరిన్ని క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించిప్రోత్సహిస్తామన్నారు. అనంతరం టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎంఎస్ ఆన్సర్ భాష మాట్లాడుతూ … రాష్ట్రస్థాయి పోటీలు చాగలమరిలో నిర్వహించడం పట్ల తాము క్రీడాకారుడిగా గర్విస్తున్నామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరు కావడం క్రీడా స్ఫూర్తి కి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొలిమి హుస్సేన్ వల్లి, కొలిమి మాబు షరీఫ్, ఎంఎస్ సమీరుద్దీన్, జెట్టి నాగరాజు, విద్యా కమిటీ చైర్మన్ గౌస్ మొహిద్దిన్, మౌలాలి, హనీఫ్ ,మద్దూరు మా బూలాల్,గఫార్, నూర్ భాషా,సల్ల నాగరాజు,ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామాంజనేయులు, నంద్యాల జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహబూబ్ బాషా, క్రీడా సంఘ ప్రతినిధులు దాదా పీర్, షేక్షావలి, మెహబూబ్ భాష జంషీర్,అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.
