పలాస రైల్వే స్టేషన్‌ ను పరిశీలించిన భువనేశ్వర్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌

పలాస (శ్రీకాకుళం) : పలాస రైల్వే స్టేషన్‌ ను భువనేశ్వర్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ పంక్వాల్‌ సోమవారం ఉదయం పరిశీలించారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆయన్ని మర్యాదపూర్వకంగా కాశీబుగ్గ రైల్వే వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. విభిన్న ప్రతిభ వంతులకు స్టేషన్‌ లో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. పలాస, మందస రోడ్‌, పూండి రైల్వే స్టేషన్‌ పలు సమస్యల పై వినతి పత్రం అందజేశారు. ఆమెతో పాటు ఎపి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి విఠల్‌ రావు లడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ గాలి కృష్ణారావు డొక్కరి శంకర్‌ కొరికాన శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️