ఘనంగా చెకుముకి సంబరాలు

పజాశక్తి-సంతనూతలపాడు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్టులో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో స్థానిక ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థుల టీము, ప్రైవేటు పాఠశాలల విభాగంలో పేర్నమిట్ట గురుదత్త హైస్కూలు విద్యార్థుల టీము మండల స్తాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. టాలెంట్‌ టెస్ట్‌ ప్రశ్నాపత్రాలను ఎంఈఓ-2 డి వెంకారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కోదాటి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు బి సాంబశివరావు స్థానిక హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎన్‌ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు టి సుబ్బారావు, రంగనాయకులుతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ టెస్టులో మండలంలోని 13 పాఠశాలల టీములు పాల్గొన్నాయి. సిఎస్‌పురం: మండల స్థాయిలో జరిగిన చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో శీలంవారిపల్లి కదిరి వెంకటనరసయ్య లక్ష్మమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్లస్‌ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. సిఎస్‌ పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష పేపరును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్‌ ఖాదరున్నీసాబేగం విడుదల చేశారు. మండలంలోని 8 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలో కదిరి వెంకట నరసయ్య లక్ష్మమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్లస్‌ విద్యార్థులు షేక్‌ హామీదా, గుర్రం సుప్రజ, మేకల మనోహర్‌ల టీమ్‌ విజేతలుగా నిలిచారు. రెండో విజేతలుగా అంబవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నల్లమడుగుల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలిచారు. పర్యవేక్షకులుగా జవంగుల వెంకట్రావు వ్యవహరించారు. విజేతలకు మండల విద్యాశాఖ అధికారులు జగన్నాథం ప్రసాద్‌రావు, రాజాల కొండారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు మానవ హక్కుల సంఘం చైర్మన్‌ షేక్‌ గౌస్‌ సౌజన్యంతో అందించారు.

➡️