జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు అక్కా చెల్లెలు

Nov 7,2024 21:29

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు అట్టాడ ధనుశ్రీ , అట్టాడ దీక్ష తైక్వాండోలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. గత నెల 4,5 తేదీలలో కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 19 పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ధనుశ్రీ ఎంపికైంది. డిసెంబర్‌ 18 నుండి 25 వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఆమె వెళ్లనుంది. అట్టాడ దీక్షశ్రీ కూడా అక్క బాటలో నడుస్తూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తోంది. గత నెల 6, 7 తేదీలలో తిరుపతిలో జరిగిన 68వ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 8 నుండి 12 వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం విదీశ జిల్లాలో జరుగునున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననుంది.

➡️