బైక్‌ ఢకొీని వ్యక్తి మృతి

ప్రజాశక్తి-కొండపి: రోడ్డు పక్కన నడుచు కుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌ ఢకొీట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డ సంఘ టన కొండపి మండలం లోని పెరిదేపి దగ్గర చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చవ గ్రామానికి చెందిన మంచాల మాలకొండయ్య (62) పొగ తోటలలో సేద్యం నిమ్తితం పెరిదేపిలో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం అరక నుంచి ఇంటికి వస్తుండగా మిట్టపాలెం గ్రామానికి చెందిన దర్నాసి శివ బైక్‌పై వెనుక నుంచి వస్తూ మాలకొండయ్యను ఢకొీట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. దర్నాసి శివకు తలకు తీవ్రగాయాలు కాగా, మాలకొండయ్యకు కాలికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇరువురిని ప్రైవేటు వాహనంలో కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఒంగోలుకు తరలించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా మంచాల మాలకొండయ్య మృతి చెందాడు.

➡️