సిపిఎం నాయకుల బైక్‌ ర్యాలీ

Feb 1,2025 00:20
ఫొటో : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ఫొటో : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

సిపిఎం నాయకుల బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి-కోవూరు : నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోవూరు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మహిళా నాయకురాలు జక్కా శేషమ్మ వవ్వేటి సుబ్బారెడ్డి స్మారక స్థూపానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ బైక్‌ ర్యాలీ కోవూరు పట్టణంలోని మైథిలీ సెంటర్‌, మందబయలు సెంటర్‌, బజార్‌ సెంటర్‌, తదుపరి పాటూరు గంగవరం, పోతిరెడ్డిపాలెం సాలుచింతల, పడుగుపాడు, తదితర గ్రామాల మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మహాసభలో మూడు రోజుల పాటు జగన్‌ ఉన్నాయని ఈ మహాసభలకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బృందాకరాత్‌, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక ప్రజా సమస్యలపై చర్చ చర్చ జరిగి పోరాటాలకు కల్పన ఇవ్వనున్నారని తెలియజేశారు. అనంతరం మూడో తేదీ సాయంత్రం మూడు గంటలకు ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి విఆర్‌సి సెంటర్‌ వరకు బహిరంగ సభ జరుగునుందని ఈ సభకు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గండవరపు శేషయ్య, బుజ్జియ్య, సుబ్బారావు, రమణయ్య, వెంకటేశ్వర్లు, భాస్కర్‌, రమేష్‌, విజయకుమార్‌, సర్దార్‌, గోవర్ధన్‌, సురేష్‌, కాలేషా, హరి, మోహన్‌, జానకిరాం, తదితరులు పాల్గొన్నారు.

➡️