డబ్ల్యుఎస్‌ఒ బోర్డు డైరెక్టర్‌గా బిందుమీనన్‌

Jun 8,2024 22:03
డబ్ల్యుఎస్‌ఒ బోర్డు డైరెక్టర్‌గా బిందుమీనన్‌

మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీరామ్‌ సతీస్‌, పక్కన డాక్టర్‌ బిందుమీనన్‌
డబ్ల్యుఎస్‌ఒ బోర్డు డైరెక్టర్‌గా బిందుమీనన్‌
పజాశక్తి-నెల్లూరు :అపోలో స్పెషాలిటీ వైద్యశాల సీనియర్‌ కన్సల్టెంట్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టరు బిందుమీనన్‌కు అరుదైన గౌరవం దక్కింది. శనివారం అపోలో వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ వైద్యశాల డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టరు శ్రీరాం సతీష్‌ మీడియాను ఉద్ధేశించి మాట్లాడుతూ అపోలో వైద్యశాలలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా, న్యూరాలజిస్టుగా రోగులకు సేవలందిస్తున్న డాక్టరు బిందు మీనన్‌ వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ బోర్డు డైరెక్టర్‌గా ఎన్నిక కావడం సంతోషకర మన్నారు. వైద్య వృత్తిలో అడుగిడుతున్న యువత, ముఖ్యంగా న్యూరాలజిస్టులుగా వైద్యసే వలం దించేందుకు సిద ్ధమవు తున్న వైద్యులు డాక్టరు బిందుమీనన్‌ను ఆదర్శ వంతంగా తీసుకోవాలన్నారు. నరాలకు సంబం ధించిన అనారోగ్య సమస్యలతో బాదపడే వారికి న్యూరాలజిస్టుగా ఆమె అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. డాక్టరు బిందుమీనన్‌ మాట్లాడుతూ 2024- 2028 కాలానికి వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ బోర్డు డైరెక్టరుగా ఎన్నిక కావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

➡️