ఉత్తమ పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన శిశువు జననం

Oct 2,2024 14:49 #Birth, #optimal nutrition

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : గర్భిణీలు, బాలింతలు నిర్దేశించిన ఉత్తమ పౌష్టికాహరాన్ని స్వీకరించి ఆరోగ్యవంతమైన శిశువులకు జననం ఇవ్వాలని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ టి.నాగలక్ష్మి, టిడిపి గ్రామ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు, జనసేన నాయకులు కొత్తపల్లి నగేష్‌ అన్నారు. కొత్తపేట ప్రాజెక్ట్‌ ఐసిడిఎస్‌ సిడిపిఓ పి.శారద ఆదేశాల మేరకు మండలంలోని మడికి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోస్తవాలపై సర్పంచ్‌ ఉండ్రాజపు లక్ష్మీ మౌనిక చిన్నా అధ్యక్షతన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాబోయే తరాల పటిష్టత కోసం గర్భిణీలకు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాలను వఅధా చేయకుండా వినియోగించుకోవాలన్నారు. దీంతో ఆరోగ్యవంతమైన శిశు జననంతో బావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం గర్భిణీలకు సీమంతోత్సవం, శిశువులకు అన్నప్రాసన నిర్వహించి, లబ్ధిదారులకు ఉత్తమ పౌష్టికాహారా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఈదర రమేష్‌, అడ్డాల సత్యనారాయణ రాజు, కొత్తపల్లి కఅష్ణ, టిడిపి మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు చెల్లబోయిన సింహాచలం, అంగన్వాడీల మండల అధ్యక్షులు యు.సుశీల, చెముడులంక సెక్టర్‌ లీడర్‌ మెర్సి ఫ్లోరెన్స్‌, అంగన్వాడీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️