మంత్రి స్వామి పుట్టినరోజు వేడుకలు

ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు వేడుకలు బుధవారం శింగరాయకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కందుకూరు రోడ్డులోని నందమూరి తారకరామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం మంత్రి డాక్టర్‌ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్‌ చేశారు. అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కలికివాయి గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు మందలపు గాంధీ చౌదరి, గనిపినేని రవి చౌదరి, పెముల బాబురావు ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్‌ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బింగినపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు సీనియర్‌ నాయకులు సన్నెబోయిన మాలకొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పుల సింగయ్య, చీమకుర్తి కృష్ణ, మించల బ్రహ్మయ్య, కూనపురెడ్డి వెంకటసుబ్బారావు, సుదర్శి ప్రసాదరావు, ఇమ్మడిశెట్టి రామారావు, చిగురుపాటి శేషగిరి, కనిగిరి వెంకటేశ్వర్లు, మోటుపల్లి వెంకటేశ్వర్లు, గనీపనేని రవిచౌదరి, మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు ఎస్‌డి సర్దార్‌, పామర్తి మాధవరావు, సుబ్రహ్మణ్యం, దక్షిణం శ్రీను, వార్డు సభ్యులు వలేటి రవిశంకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️