ప్రజాశక్తి – రేపల్లె : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నేతలు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా జన్మదిన వేడుకల్లో పాల్గొని మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకంంది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, బాపట్ల ఎంపీ తెన్నేటి కష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపట్నం : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను జడ్‌పిటిసి నర్రా సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో నర్రా సుబ్బయ్య దంపతులు కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నర్రా సుబ్బయ్య నిజాంపట్నం నుంచి భారీ బైక్ ర్యాలీగా రేపల్లెకు తరలి వెళ్లి మంత్రి అనగానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి. గంగరాజు, యన్. సునీల్ కుమార్ యన్. పోల్రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.