ఎమ్మెల్యే ముత్తుముల జన్మదినం

ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలు మండలం తాటి చెర్ల పంచాయతీ హసనాపు రంలో టిడిపి మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేకు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజుపాలెం సచివాలయం వద్ద టీడీపీ నాయకులు గోడి ఓబుల్‌ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, గ్రామస్తుల మధ్య భారీ కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వర్లు, ట్రాక్టర్‌ వెంకటేశ్వర్లు, పుల్లయ్య, బత్తుల యల్లయ్య, పాల్వాది, వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ బొమ్మని శ్రీనివాసులు, నల్లబోతుల వెంకటస్వామి, తమ్మిశెట్టి ప్రసాదు పాల్గొన్నారు..

➡️