ప్రజాశక్తి – టంగుటూరు: పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ ఎం. శ్రీధర్ మాట్లాడుతూ తలసేమియా రోగులకు రక్తం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యమ్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తలసేమియా అనేది భయంకరమైన వ్యాధి అని దానిని రూపుమాపటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జివి మూర్తి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్.వీరాంజనేయులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.మల్లిఖార్జునరావు, హెల్త్ వాచ్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
