ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షురాలు, విశ్వహిందూ పరిషత్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుంకర ప్రతిమ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సౌజన్యంతో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరం వద్ద 48 మంది దాతఅత్వ హఅదయంతో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమములో ఏజీ కిషోర్, కుమార్, పొన్న కాటయ్య, రమణయ్య, బైరు పార్థసారధి, సాయి, మల్లె స్వామి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.