అద్దంకి : రక్తహీనతతో బాధ పడుతున్న కాకానిపాలెంకు చెందిన సందిరెడ్డి హనుమా యమ్మకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. దీంతో హనుమయమ్మ కుటుంబ సభ్యులు రోటరీ క్లబ్ ప్రతినిధులను సంప్రదించారు. రోటరీ బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ కార్యదర్శి చుండూరి మురళీ సుధాకరరావు పాత దామావారి పాలేనికి చెందిన షేక్ అబ్దుల్ మాలిక్‌ను ప్రోత్సహించి రక్త దానం చేయించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, ట్రెజరర్ మలాది శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
