ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రతి ష్టాత్మక తెలుగు రాష్ట్రాల 8వ ఆహ్వాన నాటిక పోటీలు గురజాడ కళాభారతిలో శనివారం ఘనం గా ప్రారంభ మయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన కళాంజలి ఆధ్వర్యాన రైతేరాజు సాంఘిక నాటిక అందరినీ కట్టిపడేసింది. విజయనగరం నాటకశాల ఆధ్వర్యాన ప్రదర్శించిన బంధనం నాటిక ఆహూతులను ఆకట్టుకుంది. రైతే రాజు నాటికలో రాజకీయ నాయకులు రైతులను ఏ విధంగా దోచుకు తింటున్నారో చూపించి, రైతులు తిరగబడితే రాజకీయ నాయకులు పరిపాలకులు ఎక్కడ ఉంటారు..చివరకు రైతు దేవోభవ అంటూ రైతును సన్మానించిన అంశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంధనం నాటిక నేటి రోజుల్లో కుటుంబానికి విలువకుండా వంటల జీవితాలకు ఇష్టపడుతున్న ఈ సమాజాన్ని ఉమ్మడి కుటుంబాల వైపు ఎందుకు వెళ్లాలో, ఎందుకు జీవించాలో చూపించారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, లోక్‌సత్తా అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ ఈపోటీలను ప్రారంభించారు. వైసిపి నాయకులు జమ్ము శ్రీను, జర్నలిస్ట్ బూరాడ శ్రీనివాసరావు , అభినయ శ్రీనివాసరావు, గెద్ధ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.