ప్రజాశక్తి – ఆళ్లగడ్డ : కేసీ కెనాల్ ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీ-8 కమిటీ అధ్యక్షులుగా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బొబ్బూరి వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పెద్ద చింతకుంటకు చెందిన కుందూరు రామిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క డబ్ల్యూయుఏ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, తాలూకా టిడిపి యువ నాయకులు భార్గవరామ్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధి సత్యం, సురేంద్ర చౌదరి, గూబగుండం సర్పంచ్ ఉపేంద్ర, కుందూరు హర్షవర్ధన్ రెడ్డి, చింతకుంట సుబ్బారెడ్డి, నూకా నరసింహారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
