అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

దేవరపల్లి (అనకాపల్లి) : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం కనిపించిన ఘటన సోమవారం అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో జరిగింది. మారేపల్లి గ్రామానికి చెందిన అల్లు అప్పారావు (40) అనే వ్యక్తి మృతదేహం తెలుగుపూడి మారేపల్లి రహదారిలోని చెరుకు తోటలో కనిపించడంతో స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐడి నాగేంద్ర ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎస్సై కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం వ్యక్తి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ హాస్పిటల్‌ కి తరలించారు.

➡️