Accident – లారీని ఢీకొట్టిన బొలెరో – ఇద్దరు మృతి

ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : లారీని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా జిలగలగండి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నాలుగున్నర గంటల సమయంలో సామర్లకోట గ్రామానికి చెందిన కోట వరప్రసాద్‌ (50), చీపురుపల్లి శివకృష్ణ (29) బొలెరో వాహనంలో చేప పిల్లల లోడ్‌ తీసుకుని చల్లపల్లి వైపు నుంచి బందరుకు బయలుదేరారు. అస్సాం నుంచి సరుగు బోదుల లోడు తీసుకున్న లారీ చీరాలకు వెళుతుంది. ఈ క్రమంలో జీలగలగండి వద్ద లారీని బలంగా బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. అందులో ఉన్న సూపర్వైజర్‌, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్సై ప్రతాపరెడ్డి, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి, సహాయక చర్యలను స్థానికుల సాయంతో చేపట్టారు. నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రమాద స్థితిని బట్టి తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️