ప్రజాశక్తి- టంగుటూరు : మాజీ ముఖ్యమంత్రి, వైసిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని తాడేపల్లి లోని ఆయన నివాస గృహంలో బీసీ విభాగంగా జోన్ -5 రాష్ట్ర ఇన్‌ఛార్జి బొట్ల రామారావు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో వైసిపి కార్యకర్తలు, నాయకుల పై తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు చేస్తున్న భౌతిక దాడులు గురించి, అక్రమ కేసులు బనాయించడం గురించి వివరించారు. అదేవిధంగా వైసిపి నాయకుల ఆస్తులను కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో జెసిబిలతో ధ్వసం చేస్తున్న విషయాన్ని జగన్ మోహనరెడ్డికి వివరించారు. దీంతో స్పందించిన జగన్ మోహన్ మాట్లాడుతూ టిడిపి నాయకులు అక్రమాలను దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరపున సీనియర్ న్యాయవాదులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మితిమీరి వ్యహరిస్తున్న అధికారులకు న్యాయస్థానాల ద్వారా గుణపాఠం చెబుదామని తెలిపినట్లు రామారావు తెలిపారు. టిడిపి నాయకులు విధ్వంసంలో ఆస్తులు నష్టపోయిన, మరణించిన, గాయపడినా కుటుంబాలను త్వరలో పరామర్శించనున్నట్లు జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆయన తెలిపారు.
