పాముకాటుకు గురై బాలుడు మృతి

గిద్దలూరు (ప్రకాశం) : పాముకాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లి గ్రామంలో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో పాముకాటుకు గురయ్యాడు. ఇల్లు రేకుల షెడ్డు కావడంతో పై రేకుల్లో నుంచి మంచం పై నిద్రిస్తున్న బాలుడిపై పడి కాటు వేసిందని తల్లి తెలిపింది. అదే సమయంలో హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాత్రి సుమారు మూడు గంటలకు ప్రభుత్వ వైద్యశాలలో బాలుడు మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి వైద్యులు లేక మృతి చెందాడా ? లేక పాముకటుకు సరైనా వైద్యం లేక మృతి చెందాడా ? పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️