ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ప్రీతమ్ అమర్త్య వంకాయలపాటి పుట్టినరోజు సంద ర్భంగా ప్రీతమ్ వర్షిత హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య, రాజేశ్వరి ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్‌లో రావి అంజయ్య రోడ్డులో గుడ్ న్యూస్ మినిస్టరీ అంధుల పాఠశాలలో బియ్యం, నిత్యావసర వస్తు వులు, అంధులకు బ్రెయిలీ బుక్స్ అందజేశారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమం లో భోజనం, వసతి ఏర్పాటుతో పాటు పిల్లలకు నోట్ బుక్స్, పండ్లు, కాయలు పంపిణీ చేశారు. ప్రీతమ్ పుట్టిన రోజును చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి.. వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మారెళ్ల రాజేశ్వరి, వంకాయలపాటి సత్యవతి, శ్రీదేవి, గుడ్ న్యూస్ మినిస్ట్రీ నిర్వాహకులు స్వర్ణ మోహన్‌రావు, బొమ్మరిల్లు నిర్వాహకులు ఖాసీం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.