అంధుల పాలిట ఆరాధ్య దైవం బ్రెయిలీ : జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : లూయిస్‌ బ్రెయిలీ అంధుల లిపిని 12 నుంచి 6 చుక్కలకి కుదించి అంధుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని జిల్లా కలెక్టర్‌ పి అరుణ్‌ బాబు అన్నారు. ఈ నెల 4 వ తేది నుండి లూయిస్‌ బ్రెయిలీ జన్మదిన వారోత్సవాలు సందర్బంగా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు అధ్వర్యం లో లూథర్న్‌ బ్లైండ్‌ హై స్కూల్‌ లో లూయిస్‌ బ్రెయిలీ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు లు మాట్లాడుతూ … లూయిస్‌ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి 4 పారిస్కు తూర్పున ఇరవై మైళ్ల దూరంలో ఉన్న హొకూ ప్రేహొ అనే చిన్న గ్రామంలో జన్మించారని, బ్రెయిలీ తల్లిదండ్రులు చేస్తున్న పనిలో నిమగ్నమై ఉండగా ఆ సమయంలో కత్తితో ఆడుతుండగా కత్తి చివరి భాగం తన కంటికి తగలడం వల్ల చిన్న వయసులోనే తన చూపును కోల్పోవడం జరిగిందన్నారు. బ్రెయిలీ తన చూపు కోల్పోయాడని నిరాశ పడకుండా తోబుట్టువులతో కలసి పాఠశాలకు వెళ్లి చదువును కొనసాగించారని. అలాగే లూయిస్‌ బ్రెయిలీ అంధుల లిపిని 12 నుంచి 6 చుక్కలకి కుదించి అంధుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని, స్పర్శ కోడ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం వలన ఈరోజు అంధులు ఉన్నతి స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం అన్నారు. అనంతరం బ్రెయిలీ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. విద్యార్థులు కి క్రికెట్‌ కిట్‌లు ల్యాప్‌టాప్‌లు అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి, విద్యార్థులు,వివిధ విసిఎ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️