తల్లిపాలు అమృతంతో సమానం

ప్రజాశక్తి -కనిగిరి : తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు పార్వతి, మల్లేశ్వరి తెలిపారు. మండలపరిధిలోని లింగారెడ్డిపల్లి, చాకిరాల అంగన్‌వాడీ కేంద్రాల్లోతల్లిపాలు వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పాలలో బిడ్డకు సరిపడి పోషకాలు, వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు. .. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు సరస్వతి, ధనమ్మ, జ్యోతి, భాగ్యలక్ష్మి ,దీపిక, జ్యోతి,జరీనా, మాధవి,ఎఎన్‌ఎం శాంతమ్మ , హెచ్‌పి షేక్‌ నాగుల్‌ మీరా , ఆదిలక్ష్మి, సౌజన్య, వెంగమ్మ ,జ్యోతి ,ఆశ వర్కర్‌ పి. నాగమణి ,ఫీల్డ్‌ ఆఫీసర్‌ మాలకొండయ్య, డ్వాక్రా సభ్యులు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు. సిఎస్‌ పురంరూరల్‌ : బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రు పాలు తాగించాలని ఆనికాలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, అంగన్‌వాడీ కార్యకర్త సహనాజ్‌ తెలిపారు. మండల పరిధిలోని ఆనికాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పాలు బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు తల్లి పాలు తాగించడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అలేఖ్య, ఎఎన్‌ఎం ఆంతో నమ్మ, ఆశాజ్యోతి, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. దర్శి : తల్లిపాలతో చిన్నారులకు ఎంతో కలుగుతుందని ఎఎన్‌ఎం షేక్‌ చిన్నమస్తానమ్మ తెలిపారు. రాజంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త నరసమ్మ, చిన్నారులు, గర్భిణులుపాల్గొన్నారు

➡️