ప్లాన్‌ మంజూరుకు లంచం

Apr 19,2024 00:34

ఏసీబీకి పట్టుబడిన చంద్రశేఖరరావు రాజేంద్ర సాయినాథ్‌
ప్రజాశక్తి – తెనాలి :
స్థానిక చెంచుపేట అమరావతి ప్లాట్స్‌ లోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించింది. సీఆర్డీఏ ప్లాన్‌ అప్రూవల్‌ కోసం టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ ఎల్‌.చంద్రశేఖరరావు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర సాయినాథ్‌ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వడ్లమూడికి చెందిన రత్నబాబు, తన సోదరుడుకు సంబంధించి జి ప్లస్‌ త్రీ బిల్డింగ్‌ నిర్మాణం నిమిత్తం సిఆర్‌డిఎ అప్రూవల్‌ కోసం కార్యాలయంలో సంప్రదించగా రూ.70 వేలు డిమాండ్‌ చేశారని, రూ.30 అతని నుంచి తీసుకుంటుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎసిబి గుంటూరు రేంజ్‌ డీఎస్పీ మహేంద్రనాధ్‌ తెలిపారు. దాడుల్లో డీఎస్పీలు సత్యానంద్‌, ప్రతాప్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️