ఫిషింగ్‌ హార్బర్‌లో దారుణ హత్య

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో సినిమా తరహాలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాలికి బరువైన రాయి కట్టి సముద్రంలో ఆ వ్యక్తిని పడేసి హత్య చేయడం చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ పదో నెంబర్‌ జెట్టీ వద్ద సముద్రంలో తేలుతూ మృతదేహం కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్‌ సిఐ జి.దేవుడుబాబు సంఘటనా స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది గుర్తించడం సాధ్యం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️