బిటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ప్రజాశక్తి – మైదుకూరు/ కలికిరిమైదుకూరు మండలానికి చెందిన బిటెక్‌ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు కున్నాడు. కళాశాలలో ర్యాగింగ్‌ చేయడం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ అతని బంధువులు పేర్కొం టున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మైదు కూరు మండలం జి.వి. సత్రానికి చెందిన నాగేంద్రకు ఇద్దరు కుమారులు. వారిలో రెండో కుమా రుడు ప్రవీణ్‌ (21) అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరి జెఎన్‌టియు కళాశాలలో బిటెక్‌ రెండో సంవత్సరంలోకొత్తగా చేరాడు. కొద్ది రోజు లుగా ప్రవీణ్‌ను కళాశాలలోని కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. దీంతో అతను ఈనెల 25న ఇంటికి వచ్చేశాడు. కుటుంబ సభ్యులు తిరిగి కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక, ఈనెల 26న అతను ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం వెంటనే తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని అనుకున్న కుమారుడు తమకు పుత్ర శోకాన్ని మిగిల్చాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదు మేరకు మైదుకూరు పోలీసులు కలికిరి జెఎన్‌టియు కళాశాలకు చేరుకుని కలికిరి సిఐ రెడ్డి శేఖర్‌ రెడ్డి సాయంతో ప్రిన్సిపల్‌ వెంకటేశ్వరరావును, తోటి విద్యార్థులను విచారించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రవీణ్‌ ఆగస్టు 12న డిటెక్‌ సెకండియర్‌లో జాయిన్‌ అయ్యాడని, అదే రోజు లగేజ్‌ కోసం ఇంటికి వెళ్లి 20న కళాశాలకు వచ్చి మూడు రోజులు క్లాసులకు హాజరయ్యాడని తెలిపారు. 23 సాయంత్రం హాస్టల్‌ నుంచి ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడని, తర్వాత 26న మతుని తండ్రి ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పడంతో నివ్వెరిపోయామని చెప్పారు. గురువారం పోలీసులు వచ్చి విచారించారని, ర్యాగింగ్‌ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

➡️