గజపతి (శ్రీకాకుళం) : ‘ ధాన్యాన్ని కొనండి ‘ అంటూ … గజపతి జిల్లా గుసాని సమితి పెద్ద కొత్తూరు పంచాయతీ పరిధిలోని రైతులు రైతు సొసైటీకి తాళాలు వేసి మంగళవారం నిరసన తెలిపారు. ఇప్పటికీ కొనుగోలు జరగకుండా మిగిలిపోయిన సుమారు 13 వేల క్వింటాళ్ళు ధాన్యం కొనుగోలు జరపాలని, లాప్స్ అయిన తమ టోకెన్లను పునరుద్ధరించాలని, తమ ధాన్యానికి సరిపడే టార్గెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
