బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం: ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేసేందుకు కషి చేస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతాన్ని ఆయన మంగళవారం సాయంత్రం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు జరిగేందుకు ఉన్న అడ్డంకులను తెలుసుకొని వారితో మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వపరంగా పరిహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక దష్టి సారించారని తెలిపారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్‌ సమస్య పట్టణంలో తొలగుతుందని ఆయన అన్నారు. ఆయన వెంట టిడిపి పట్టణ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, టిడిపి యూత్‌ నాయకులు షేక్‌ ఫిరోజ్‌, నాయకులు బాలు ఓబుల్‌ రెడ్డి, నారపరెడ్డి వెంకటరెడ్డి, ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

➡️