ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు
మహాసభల జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరులో జరిగే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జొన్నలగడ్డ వెంకమరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని దామరమడుగు నుండి ఆ పార్టీ ఆటో, బైక్ ప్రచారం మొదలుపెట్టారు. ప్రచార భేరిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశాయని ఆ వాగ్దానాలు నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేసే విధంగా ఈ మహాసభల్లో పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. సోమవారం 3న ఆత్మకూరు బస్టాండ్ నుంచి విఆర్ కళాశాల వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని, అదేవిధంగా విఆర్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనకు, బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు, సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున, నాయకులు గరికిపాటి సురేష్, పుత్తేటి మల్లికార్జున, రేకులకుంట అంకయ్య, విస్సా మునిస్వామి, కృష్ణ ప్రసాద్, శ్రీనివాసులు, షేక్ జానీబాషా, దత్తశ్రీ కోటయ్య, కొమి శ్రీనివాసులు, కన్నయ్య రత్తయ్య, జానకి రామయ్య, ప్రభాకర్, మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.