ప్రజాశక్తి -యద్దనపూడి (బాపట్ల) : మండలంలోని చిమటావారిపాలెం, వింజనంపాడు గ్రామమాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మేరిమ్మ మాట్లాడుతూ … రైతులు తాము పండించిన పంటలు ప్రభుత్వం వారిచే నియమించబడిన కొనుగోలు కేంద్రల వద్దనే ఆమ్ముకోవాలి అని తెలియజేశారు. యద్దనపూడి మండలంలో మొత్తం 5421 ఏకరములలో శనగ పంటను రైతులు సాగు చేశారు. పంట కోతలు కోసిన తరువాత 12 శాతం శనగ పైరు లో తేమ మరియు ఇతర నాణ్యత ప్రమాణాలు పాటించి రైతులు రైతు సేవ కేంద్రాల వద్ద మార్క్ ఫెడ్ ద్వారా తమ పంటలను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్ కి 5,650 /- రూపాయలు శనగ కి ఇస్తారని ఎ. ఒ తెలిపారు. కార్యక్రమంలో వి. ఎ. ఎ లు సుదర్శన్, లీల సత్య రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
