ప్రజాశక్తి-వి.ఆర్.పురం: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పాఠశాల స్థాయిలో నిర్వహించిన చెకుముకి పరీక్షలో భాగంగా వి.ఆర్.పురం మండల కేంద్రంలోని జెడ్‌పి హైస్కూల్‌లో 8,9,10వ విద్యార్థులకు హెచ్‌ఎం.చిచ్చడి.బాబూరావు ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష లో 74 మంది విద్యార్థులు పాల్గొన్నారుి ఇన్విజిలేటర్‌గా కె.రాము, జి.శ్రావణి, కె.ప్రసాద్, ఎన్.అనిల్, డి సత్యనారాయణ వ్యవహరించారు. చెకుముకి పరీక్ష విజయవంతానికి సహకరించిన హెచ్‌ఎం ఇతర ఉపాధ్యాయులకు యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక తరపున కృతజ్ఞతలు తెలిపారు.
పరీక్షను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయులు