ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటూ ప్రచారం

Jun 10,2024 21:42
ఫొటో : కరపత్రాలు పంచుతున్న ఉపాధ్యాయులు

ఫొటో : కరపత్రాలు పంచుతున్న ఉపాధ్యాయులు
ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటూ ప్రచారం
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులు చేరాలంటూ ప్రభుత్వ ఎఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సిబ్బంది ప్రచారం చేపట్టి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో మౌలిక వసతుల, నాణ్యమైన విద్యాబోధన ఉత్తమమైన ఉపాధ్యాయులతో అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫలితాలు ప్రయివేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మిన్నగా వచ్చాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తించి ప్రభుత్వం కళాశాలలో పాఠశాలలో చేరాలని కోరారు. అనంతరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యాబోధన వసతులను వారికి అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థుల సమగ్రాభివద్ధికి ప్రభుత్వ పాఠశాలలే పునాదని జి.అయ్యవారిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు ఎం.ఫణిరాజు నూతన అడ్మిషన్స్‌ కోసం ఇంటింటికి తిరిగి విద్యార్థులకు పౌష్టికాహారం, విలువలతో కూడిన ఉత్తమ విద్యా బోధన డిజిటల్‌ తరగతి గదుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కిరణ్‌, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

➡️