14న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ప్రచార యాత్ర

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 14న జరుగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ తాడేపల్లిగూడెంలో జీపు జాత ప్రచార యాత్ర ర్యాలీని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మంగళవారం స్థానిక పోలీసు ఐ ల్యాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరావు స్థానిక పోలీసు ఐల్యాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రైతు సంఘం,సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ, జీపు ప్రచార యాత్రని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు,సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ లు మాట్లాడుతూ మార్చి 14 తేదీన ఢిల్లీ నగరంలో జరిగె చలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రచారం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విధానాల వల్ల రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఒకపక్క కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అప్పజెప్పడం వల్ల కార్మిక వర్గం కట్టు బానిసలాగా మారారని తెలిపారు వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కోత విధించడం వల్ల ఉపాధి కూలీలకు పనులు తగ్గాయని తెలిపారు కౌవులుదారులకు గుర్తింపు కార్డులు లేని కారణంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కారన వల్ల వ్యవసాయ రంగంకి దూరం అవుతున్నారని ఈ విధానాలకి వ్యతిరేకంగా మార్చి 14వ తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీ తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జువ్వాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, బంకూరు నాగేశ్వరరావు, పెనుగంటి దుర్గా, శిద్దిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, బొడబొళ్ళ లక్ష్మీనారాయణ, యడవల్లి వెంకట దుర్గారావు, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️